మాల్దీవుల నుంచి బహిష్కరణకు గురైన 43 మంది భారతీయులు
- February 15, 2024
మాలే: వీసా రూల్స్ ఉల్లంఘన సహా పలు నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మాల్దీవుల ప్రభుత్వం 43 మంది భారతీయులను వెనక్కి పంపించింది. దేశంలో అక్రమ వ్యాపారాలు, డ్రగ్స్ దందాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీలలో వివిధ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి స్వదేశానికి పంపించింది. మొత్తంగా 186 మంది విదేశీయులను వెనక్కి పంపగా.. అందులో ఎక్కువ శాతం బంగ్లాదేశీయులే ఉన్నారని హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.
వీసా మానిప్యులేషన్, గడువు తీరినా అక్రమంగా దేశంలోనే ఉండడం, డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి వారి వారి దేశాలకు పంపించామని వివరించారు. ఇలా వెనక్కి పంపిన వారిలో బంగ్లాదేశీయులు 83 మంది, భారతీయులు 43 మంది, శ్రీలంక పౌరులు 25 మందితో పాటు ఎనిమిది మంది నేపాలీయులు ఉన్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







