ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..11 మంది మృతి
- February 16, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలోని అలీపూర్ లోని పెయింట్స్, కెమికల్ గోడౌన్ లలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ఈ మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే 22 ఫైరింజన్లు సంఘటనా స్థలంకు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. అర్థరాత్రి తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు ఎగిసిపడడంతో ఫ్యాక్టరీ పక్కనే ఉన్న పలు నివాసాల గోడలు కూడా దెబ్బతిన్నాయి. మృతుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, గుర్తుపట్టలేని పరిస్థితులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను మార్చరీకి తరలించారు. వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ జనావాసాల మధ్య ఉండటంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మెట్ల మార్గం నుంచి మంటలు వ్యాప్తి చెందడంతో లోపల ఉన్న కార్మికులు తప్పించుకోలేక పోయినట్లు స్థానిక అధికారి తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మంటల వ్యాప్తికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలాఉంటే.. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అతుల్ గార్డ్ వివరాలప్రకారం.. మరో ఇద్దరు వ్యక్తులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నారని తెలిపారు.
ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి సుమిత్ భరద్వాజ్ మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. పేలుడు శబ్దం విని అందరూ ఇక్కడకు చేరుకున్నామని, మేము మమంటలను ఆర్పడానికి ప్రయత్నించే సమయంలో తొలుత 7నుంచి 8 అగ్నిప్రమాక యంత్రాలు ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపుచేసే చర్యలు ప్రారంభించాయని, అయిన మంటలు అదుపులోకి రాకపోవటంతో ఆ తరువాత మరికొన్ని అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయని చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







