అల్ ఐన్‌లోని నివాసితులను వదలని వరద కష్టాలు..!

- February 16, 2024 , by Maagulf
అల్ ఐన్‌లోని నివాసితులను వదలని వరద కష్టాలు..!

యూఏఈ: భారీ వర్షాలు, వడగళ్ల వానతో అల్ ఐన్‌లోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. తుఫాను ముగిసి రోజులు అవుతున్నా ఇంట్లో కరెంటు, మంచినీటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివాసితులు చెబుతున్నారు. పాలస్తీనా ప్రవాసుడు మొహమ్మద్ సలీం మాట్లాడుతూ.. తుఫాను తర్వాత తన భవనం యొక్క బేస్‌మెంట్ పార్కింగ్ వరదలకు గురైందన్నారు. దీంతో నీటి పంపులు దెబ్బతిన్నాయని చెప్పారు.  విద్యుత్ గది గ్యారేజీలోకి నీరు చేరడంతో మూడు రోజులపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అల్ ఐన్‌లో పుట్టి పెరిగిన భారతీయ ప్రవాస షాదా సలీమ్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లలో ఇలాంటి వడగళ్ల వాన ఎప్పుడూ చూడలేదని అన్నారు. చాలమంది నివాసితుల కార్లు దెబ్బతిన్నాయి. బీమా కంపెనీ నుండి నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయడానికి పోలీసు నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు పలువురు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com