అల్ ఐన్లోని నివాసితులను వదలని వరద కష్టాలు..!
- February 16, 2024
యూఏఈ: భారీ వర్షాలు, వడగళ్ల వానతో అల్ ఐన్లోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. తుఫాను ముగిసి రోజులు అవుతున్నా ఇంట్లో కరెంటు, మంచినీటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివాసితులు చెబుతున్నారు. పాలస్తీనా ప్రవాసుడు మొహమ్మద్ సలీం మాట్లాడుతూ.. తుఫాను తర్వాత తన భవనం యొక్క బేస్మెంట్ పార్కింగ్ వరదలకు గురైందన్నారు. దీంతో నీటి పంపులు దెబ్బతిన్నాయని చెప్పారు. విద్యుత్ గది గ్యారేజీలోకి నీరు చేరడంతో మూడు రోజులపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అల్ ఐన్లో పుట్టి పెరిగిన భారతీయ ప్రవాస షాదా సలీమ్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లలో ఇలాంటి వడగళ్ల వాన ఎప్పుడూ చూడలేదని అన్నారు. చాలమంది నివాసితుల కార్లు దెబ్బతిన్నాయి. బీమా కంపెనీ నుండి నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయడానికి పోలీసు నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు పలువురు తెలిపారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







