జిఎస్‌ఎల్‌వి ఎఫ్-14 కౌంట్‌డౌన్
- February 16, 2024
సూళ్లూరుపేట: జిఎస్‌ఎల్‌వి ఎఫ్-14 కౌంట్‌డౌన్ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. 27.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం జిఎస్‌ఎల్‌వి ఎఫ్-14 రాకెట్‌ను ప్రయోగిస్తారు. మొత్తం 2272 కిలోల బరువు కలిగిన ఇన్‌శాట్ 3-డిఎస్ శాటిలైట్‌ను భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జిఎస్‌ఎల్‌వి) సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌తో ఈ రాకెట్‌ను రూపొందించారు. మూడు దశలతో నిర్మించిన ఈ రాకెట్ 19 నిమిషాల్లోనే అంతరిక్ష కక్ష్యకు చేరేలా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. 167 కిలోమీటర్లు 173 మీటర్ల పెరిజి, 33,540 కిలోమీటర్లు, 40,781 కిలోమీటర్ల అపోజీల మధ్య వృత్తాకార కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. షార్‌కు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చేరుకొని ప్రయోగ సన్నాహాలు చేపట్టారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







