ముంబై-దోహా.. ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ కార్యకలాపాలు స్టార్ట్..
- February 16, 2024
దోహా: దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ మార్చి 28 నుంచి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ముంబై నుంచి దోహాకు వారానికి నాలుగు నాన్‌స్టాప్ విమానాలను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఖాతర్-ఇండియా మధ్య ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం టికెట్లను ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ http://www.akasaair.com, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లలో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఆకాశ ఎయిర్ ప్రారంభమైన 19 నెలల కాలంలోనే వేగంగా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించడం విశేషం. ఈ ఎయిర్‌లైన్ ప్రస్తుతం 4 శాతం మార్కెట్‌ను సాధించగా, ఇండిగో 60 శాతం, టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ సమిష్టిగా 26 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. దోహా నగరం ఖతార్ రాజధాని. ఇది మధ్యప్రాచ్య ప్రాంతంలోని కీలకమైన వాణిజ్య నగరం. సాంస్కృతిక వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది.
ఆకాశ ఎయిర్ CEO వినయ్ దూబే మాట్లాడుతూ, దోహాకు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రకటించడం సంతోషంగా ఉంది. కీలకమైన భారతీయ వాణిజ్య కేంద్రమైన ముంబైతో నేరుగా దోహాను కనెక్ట్ చేయడం ద్వారా పర్యాటకం, వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం అవుతాయి. రెండు దేశాల మధ్య ప్రయాణించే వారికి ప్రయాణం సులభం అవుతుందని అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







