ICBF ఆధ్వర్యంలో ఘనంగా ఖతార్ నేషనల్ స్పోర్ట్స్ డే
- February 19, 2024
దోహా: 40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF).. ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ (ISC)తో కలిసి నిర్వహించింది. ఫిబ్రవరి 16వ తేదీన కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ లేబర్ క్యాంపుల నుండి 200 మందికి పైగా కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా టగ్ ఆఫ్ వార్, ఆర్మ్ రెజ్లింగ్ మరియు పెనాల్టీ షూటౌట్ వంటి క్రీడలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ICBF ప్రెసిడెంట్ షాన్వాస్ బావా, మాజీ అధ్యక్షులు నీలాంగ్షు డే, పిఎన్ బాబూరాజన్, అలాగే హరీందర్‌పాల్ సింగ్ భుల్లర్, కేఎస్ ప్రసాద్ వంటి సీనియర్ కమ్యూనిటీ నాయకులు, ISC జనరల్ సెక్రటరీ నిహాద్ అలీ, సెక్రటరీ ప్రదీప్ పిళ్లై సహా అపెక్స్ బాడీ సభ్యులు సహా భారతీయ కమ్యూనిటీ నుండి విశిష్ట సభ్యులు కమిటీ సభ్యులు దీపేష్ జి.కె, సుజాత ఫెర్నాండెజ్, దీపక్ చుక్కల, పురుష్ ప్రభు, ఐసిసి వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య హెబ్బాగేలు, మేనేజింగ్ కమిటీ సభ్యులు సజీవ్ సత్యశీలన్, సత్యనారాయణ మలిరెడ్డి, సలహా మండలి సభ్యురాలు నందిని అబ్బగౌని, ఐసిబిఎఫ్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు టి రామసెల్వం, శశిధర్ హెబ్బాళ, ఐసిబిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ శెట్టి, జనరల్ సెక్రటరీ బోబన్ వర్కీ, కోశాధికారి కులదీప్ కౌర్ బహ్ల్, సెక్రటరీ ముహమ్మద్ కున్హి, మేనేజింగ్ కమిటీ సభ్యులు జరీనా అహద్, శంకర్ గౌడ్, సమీర్ అహమ్మద్ మరియు అబ్దుల్ అంకిత తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









