ప్రపంచంలోనే అత్యంత బిజీ విమానాశ్రయంలో ఎన్నారైల అరుదైన రికార్డు..!
- February 19, 2024
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయం అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయులు మరో రికార్డు సృష్టించారు. గతేడాది ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు. మొత్తం 11.9 మంది భారతీయులు రాకపోకలు సాగించినట్టు దుబాయ్ విమానాశ్రయం తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా, ప్రయాణికుల సంఖ్యాపరంగా ఎయిర్పోర్టు దాదాపుగా కరోనా పూర్వపు స్థితికి చేరుకుందని వెల్లడించింది.
విమానాశ్రయం అధికారులు తెలిపిన వివారల ప్రకారం, గతేడాది మొత్తం 86,994,365 మంది ప్రయాణికులు దుబాయ్ మీదుగా రాకపోకలు సాగించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 31.7 శాతం అధికం. 2019 నాటి గరిష్ఠంతో పోలిస్తే ఇది ఒకశాతం ఎక్కువ. ముఖ్యంగా గతేడాది ద్వితీయార్థంలో ప్రయాణికుల రాకపోకల్లో గణీయ వృద్ధి కనిపించిందని దుబాయ్ ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ప్రయాణికుల రాకపోకలు గరిష్ఠస్థాయికి (7.9 మిలియన్) తాకాయి.
ఇక దేశాల వారీగా చూస్తే అత్యధికంగా11.9 మిలియన్ మంది భారతీయులు దుబాయ్ మీదుగా ప్రయాణించారు. ఆ తరువాత స్థానంలో సౌదీ అరేబియా వాళ్లు ఉన్నారు. 6.7 మిలియన్ల సౌదీ వాసులు దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు. 5.9 మిలియన్ల ప్రయాణికులతో బ్రిటన్ మూడోస్థానంలో నిలిచింది.
ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయం ద్వారా 104 దేశాల్లోని 262 గమ్యస్థానాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మొత్తం 102 అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఈ విమానాశ్రయంలో విమాన సర్వీసులు అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?







