తేజు ‘గాంజా శంకర్’.! అసలేం జరుగుతోందట.!
- February 19, 2024
‘విరూపాక్ష’ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’. ఊర మాస్ క్యారెక్టర్‌లో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడు ఈ సినిమాలో.
మాస్ డైరెక్టర్‌గా పేరున్న సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది.
కానీ, తాజాగా తెలంగాణా నార్కోటిక్స్ బ్యూరో నుంచి ‘గాంజా శంకర్’ నిర్మాతలకు నోటీసులు అందాయని సమాచారం. ఈ సినిమాలోని కంటెంట్ యూత్‌ని పాడు చేసే విధంగా వుందంటూ.. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం మంచిది కాదనీ, వెంటనే ఆపేయాలని నోటీసులిచ్చారట.
అయితే, ఈ విషయమై ఇంకా ‘గాంజా శంకర్’ టీమ్ స్పందించలేదు. ఆ మాటకొస్తే.. అంతకు ముందు జరిగిన సినిమా ఆగిపోయిందన్న ప్రచారంలోనూ టీమ్ ఎటువంటి స్పందనా ఇవ్వలేదు.
అసలు ‘గాంజా శంకర్’ విషయంలో ఏం జరుగుతోంది. అసలే ‘విరూపాక్ష’తో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం కావడంతో.. తేజు ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది.
ఈ ప్రచారాలపై అడ్డుకట్ట వేసేలా టీమ్ స్పందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి. ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







