వరుణ్ తేజ్ కోసం ఇక్కడ మెగా పవర్ స్టార్..అక్కడ ఖాన్ బాబా.!

- February 19, 2024 , by Maagulf
వరుణ్ తేజ్ కోసం ఇక్కడ మెగా పవర్ స్టార్..అక్కడ ఖాన్ బాబా.!

మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ వివాహానంతరం వస్తున్న సినిమా ‘ఆపరేషన్ వాలైంటైన్’. ప్రత్యేకమైన సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. త్వరలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది. ఇప్పటి వరకూ రిలీజైన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు.
ఆసక్తికరంగానే ప్రోమోలున్నాయన్న పబ్లిక్ రెస్పాన్స్‌తో  చిత్ర యూనిట్ మరింత అలర్ట్ అయ్యింది. సినిమాని ఇంకాస్త గట్టిగా ప్రమోట్ చేస్తోంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతోన్న ఈ సినిమాకి తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సపోర్ట్ చేస్తున్నారు.
రేపు అనగా 20 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ ట్రైలర్‌ని రామ్ చరణ్ రిలీజ్ చేస్తుండగా.. హిందీ వెర్షన్ సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు.
ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com