జెట్ ఎయిర్‌వేస్ విమాన ప్రయాణికులకు శుభవార్త..
- June 02, 2016
లీన్ సీజన్ నేపథ్యంలో విమానసంస్థల్లో ధరల యుద్ధం ఊపందుకుంది. వరుసగా ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు అడ్వాన్స్ బుకింగ్ లపై రేట్లను తగ్గిసూ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ విమాన ప్రయాణికులకు శుభవార్త అందించింది. గతంలో సెవెన్ డేస్ సేల్ ప్రకటించిన జెట్ తాజాగా 'ఫైవ్ డే సేల్' స్కీమ్‌ను ప్రకటించింది. రాబోయే వర్షాకాల సీజన్ను దృష్టిలోపెట్టుకుని స్పెషల్ తగ్గింపు ధరల్లో అందిస్తున్నట్టు తెలిపింది. తమ టికెట్ ధరల్లో 20 శాతం స్పెషల్ డిస్కౌంట్ ను ప్రకటించింది. బిజినెస్ , ఎకానమీ రెండు క్లాసుల్లో పరిమిత కాలానికి డొమెస్టిక్ మార్కెట్ కు ఇది వర్తిస్తుందని ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది.జూన్ 2 వ తేదీ 6 వరకు ఈ బుకింగ్స్ చేసుకున్నవారికి ఈ డిస్కౌంట్ వర్తించనుంది. ఇలా బుక్ చేసిన టికెట్లతో జూన్ 25 నుంచి సెప్టెంబర్30 లోపు వినియోగించుకోవాలని తెలిపింది. ఈ ఫైవ్ డే సేల్' ఈ నెల 2-9 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా దేశీయ విమాన టికెట్ ధరల్లో దాదాపు 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఎకానమీ,బిజినెస్ తరగతుల ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. జులై, జనవరి సీజన్లను లో సీజన్ గా విమానయాన సంస్థలు పరిగణిస్తాయి. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణీకులను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటించడం మామూలే. ఈ కోవలోనే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఆసియా ఇప్పటికే ఈ ఆఫర్లను ప్రకటించింన సంగతి తెలిసిందే
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







