ముంబయి కొలబా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
- June 02, 2016
దేశ ఆర్థిక రాజధాని ముంబయి కొలబా ప్రాంతంలోని కాజ్‌వేలో గల ఓ భవనంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం పైభాగం నుంచి భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో 12 అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కొలబా ప్రాంతం జన సంచారం అధికంగా ఉండే ప్రాంతం. దుకాణ సముదాయాలతో పాటు, నివాస భవనాలు అక్కడ అధికంగానే ఉంటాయి. దీంతో కాజ్‌వేను మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా అగ్నిప్రమాదం సంభవించిన ప్రాంతానికి సమీపంలో ఉన్న భవనాలను ఖాళీ చేయాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
ముంబయి డీసీపీ మనోజ్ శర్మ సంఘటనా స్థలంలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. భవనం నుంచి ఇప్పటి వరకు ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







