'సౌదీపీడియా' డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- February 20, 2024
రియాద్: సౌదీ మీడియా ఫోరమ్ కార్యకలాపాల్లో భాగంగా రియాద్‌లోని ఫ్యూచర్ ఆఫ్ మీడియా ఎగ్జిబిషన్ (ఫోమెక్స్)లో సౌదీ మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ సోమవారం 'సౌదీపీడియా' డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అబ్దుల్లా అల్-స్వాహాతో పాటు అరబ్, అంతర్జాతీయ మీడియా సంస్థల నుండి వివిధ అధికారులు పాల్గొన్నారు. విజన్ 2030 కింద హ్యూమన్ కెపాబిలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగమైన 'సౌదీపీడియాస సౌదీకి సంబంధించిన సమగ్ర జ్ఞాన సూచనగా ఉపయోగపడుతుంది. మల్టీ భాషల్లో సౌదీ అరేబియా గురించిన సమాచారం అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా మంత్రి అల్-దోసరీ మాట్లాడుతూ.. 'సౌదీపీడియా' ప్రపంచానికి సౌదీ సమాచారాన్ని అందిస్తుందన్నారు. అరబిక్‌తో ప్రారంభించి బహుభాషా వేదిక ద్వారా సౌదీ నాయకత్వం, ప్రజలు, చరిత్ర, భౌగోళికం మరియు సంస్కృతిని ప్రదర్శిస్తుందని తెలిపారు. 'సౌదీపీడియా' సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక మరియు చారిత్రక అంశాల నుండి రాజ్యం వాస్తవికతను ప్రతిబింబించే ఎన్సైక్లోపెడిక్ కంటెంట్‌ను అందిస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







