ఆ విషయంలో విశ్వక్ రూటే సెపరేటు.!
- February 20, 2024
బిజీగా సినిమాలు చేయడమే కాదు.. ఆ సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా బాగా తెలిసినోడు విశ్వక్ సేన్. రిలీజ్ దగ్గరికి వచ్చిన సినిమాలను ప్రమోట్ చేయడంలో ఎప్పటికప్పుడే కొత్త టెక్నిక్స్ ప్లే చేస్తూంటాడు.
తాజాగా ఆయన నటించిన ‘గామి’ చిత్రం రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అప్పుడెప్పుడో జరిగిపోయిన ఇష్యూని ఆసక్తికరంగా తెర పైకి తీసుకొచ్చాడు.
తద్వారా కాస్త సింపథీ, తన కొత్త సినిమాకి పబ్లిసిటీ.. ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నమాట. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో ఒక సినిమా సగం షూటింగ్ అయ్యాకా ఆగిపోయింది.
అందుకు ప్రధాన కారణం హీరో విశ్వక్ సేనే.. ఆయన కమిట్మెంట్ లేని నటుడు కావడం వల్లనే అర్జున్ ఆ సినిమాని మధ్యలో ఆపేయాల్సి వచ్చిందని అప్పట్లో ఈ ఇష్యూ ఇండస్ర్టీలో టాక్ ఆఫ్ ది టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
అప్పుడు సైలెంట్‌గా వున్న విశ్వక్ సేన్.. ఇప్పుడు ‘గామి’ సినిమా ప్రమోషన్లలో నోరు విప్పాడు. తన తప్పేం లేదనీ, ఆ సినిమా వల్ల తానే ఎక్కువ నష్టపోయాననీ, ఓ బ్యాక్ గ్రౌండ్ వున్న హీరో విషయంలో ఇలా జరిగితే అలాగే ఊరుకుంటారా.? అని సింపతీ గైన్ చేసే కార్యక్రమం చేపట్టాడు.
పబ్లిసిటీ కోసం కాకపోతే.. ఇప్పుడెందుకీ చర్చ కొత్తగా తెరపైకి తీసుకురావడం.. అంటూ కొందరు వాపోతున్నారు. మార్చి 8న ‘గామి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







