జాన్వీ కపూర్ లిస్టులో నెక్స్‌ట్ సూపర్ స్టారేనా.?
- February 20, 2024
ఎప్పటి నుంచో తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న హీరోయిన్ జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలయిన జాన్వీ కపూర్‌పై తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆప్యాయత చూపించారు.
కానీ, ఆమె నటన స్టార్ట్ చేసి దాదాపు పదేళ్లు పైబడినా సౌత్‌పై అదీ తెలుగు సినిమాపై అంతగా ఆసక్తి చూపించలేదెందుకో. ఇదిగో అదిగో జాన్వీ వస్తుందట.. అని ఎదురు చూసి చూసి ఆశలు వదిలేసుకున్నారు.
ఇన్నాళ్లకి సడెన్‌గా జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అదే ‘దేవర’ సినిమాతో. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే, మరో క్రేజీ ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో జాన్వీ ఎంపికైంది.
ఇక, రాజమౌళి తెరకెక్కించబోయే ప్యాన్ వరల్డ్ మూవీలోనూ జాన్వీ పేరు పరిశీలనకొచ్చిందట. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఏమో రాజమౌళి కోరుకుంటే.. జాన్వీ కపూర్‌ని ఈ సినిమాలో భాగం చేసేయడం ఎంత సేపు.! ఎంతైనా రాజమౌళి ప్రాజెక్ట్ అంటే, అది గ్లోబల్ ప్రాజెక్టేగా.! సో, అలా జాన్వీ కపూర్ నెక్స్‌ట్ సూపర్ స్టార్ సరసన హీరోయిన్ అవుతుందేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







