బ్లడ్ షుగర్ అదుపులో వుంచేందుకు నేచురల్ టిప్స్.!

- February 20, 2024 , by Maagulf
బ్లడ్ షుగర్ అదుపులో వుంచేందుకు నేచురల్ టిప్స్.!

ఒక్కసారి డయాబెటిస్ ఎటాక్ అయ్యిందంటే.. చాలు. దీర్ఘ కాలం దానితో బాధపడాల్సిందే. బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపు తప్పితే.. అనేక రకాల వ్యాధులు. అనవసరమైన ఒత్తిడి, టెన్షన్, గుండె పోటు వచ్చే ప్రమాదాలు.. ఇలా అన్నింటీకీ మూలం డయాబెటిస్.

మరి, డయాబెటిస్‌ని నియంత్రించుకోవడానికి అనేక రకాల ముందులున్నాయ్. వైద్య చికిత్సతో పాటూ, బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసేందుకు జీవన శైలిలో భాగంగా కొన్ని మార్పులు కూడా చేసుకోవాలి.

ముఖ్యంగా తీసుకునే ఆహారంలో మార్పులు తప్పనిసరి. నువ్వులు ఎక్కువగా తీసుకునే వారికి బ్లడ్ షుగర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అలాగే, డయాబెటిస్ వున్నవాళ్లు కూడా ప్రతీరోజూ నువ్వుల్ని తమ డైట్‌లో భాగం చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

నువ్వుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. కార్భోహైడ్రేట్స్ తక్కువగా వుంటాయ్. హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా వుంటాయ్. తద్వారా బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో వుంటుంది. నువ్వుల్లో వుండే ఫైనో రెసినోల్ కారణంగా బ్లడ్ షుగర్ ఎప్పుడూ అదుపులో వుంటుంది.

అలాగే గుమ్మడి గింజలు కూడా బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసేందుకు కీలకంగా ఉపయోగపడతాయ్. గుమ్మడి గింజలు వేసిన కూరలను తీసుకోవాలి. గ్రేవీ కోసం గుమ్మడి గింజల్ని కూరల్లో వాడుతుంటారు. ఇలా వండిన కూరగాయల్ని తింటే డయాబెటిస్ పేషెంట్లకు చాలా మంచిదని తెలుస్తోంది.

మెంతులు డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకి ఓ వరంగా చెప్పొచ్చు. ప్రతీరోజూ మెంతులు వంటకాల్లో ఉపయోగించాలి. అలాగే, మెంతి పొడిని రోజూ నీటిలో కలిపి తీసకోవడం ఉత్తమం. మెంతుల్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా వుంటుంది. ఇది, రక్తంలోని మాల్టోజ్ లెవల్స్‌ని నియంత్రిస్తుంది. తద్వారా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com