రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఈ సారైనా ఫలిస్తుందా.?
- February 20, 2024
వివాదాలతో సావాసం చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. అందుకు కారణం ఆయన తెరకెక్కించిన రెండు సినిమాలూ బ్యాక్ టు బ్యాక్ వన్ వీక్ గ్యాప్‌లో రిలీజ్ చేస్తుండడమే. ఈ వారం ఆయన తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది.
ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, జైలు ప్రయాణం, బెయిల్‌పై బయటికి రావడం.. గట్రా పలు అంశాల్ని చూపించబోతున్నారు. ఈ వారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తుండగా.. ఆయన భార్య భారతి పాత్రలో మానస నటిస్తోంది. ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ సినిమా పలు వివాదాల కారణంగా వాయిదా పడుతూ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
అలాగే మరో సినిమా ‘శపథం’ కూడా వచ్చే వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదేంటో.! ఆయన ఎప్పుడు సినిమాలు తెరకెక్కించేస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో.! అసలు కొన్ని సినిమాలైతే రిలీజ్‌కే నోచుకోవు.
కానీ, ఈ సారి మాత్రం రెండు సినిమాల్నీ వారం రోజుల గ్యాప్‌లో రిలీజ్ చేసేస్తున్నాడు. సినిమాల్లో విషయం పక్కన పెడితే.. రిలీజ్‌కి ముందు ఆయన చేసే పబ్లిసిటీ స్టంట్లే సినిమాలపై ఆసక్తిని రేకెత్తిస్తాయంతే.! అలాంటివే ఇప్పుడు రాబోయే రెండు సినిమాలూ కూడా. వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్ని ఆడిపోసుకోవడమే ఆయన సినిమాల్లోని వుద్దేశ్యం.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్‌పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్‌లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!