యూఏఈ ఇన్నోవేషన్ మంత్..వినూత్న ప్రాజెక్టుల ఆవిష్కరణ..!

- February 21, 2024 , by Maagulf
యూఏఈ ఇన్నోవేషన్ మంత్..వినూత్న ప్రాజెక్టుల ఆవిష్కరణ..!

యూఏఈ: షార్జా సిటీ మునిసిపాలిటీ (SM) యూఏఈ ఇన్నోవేషన్ మంత్ ను పురస్కరించుకుని అద్భుతమైన ప్రాజెక్ట్‌లు మరియు కార్యక్రమాలను అవిష్కరించింది. ఈ ప్రాజెక్ట్‌లు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్ట్రాటజీతో  ఎమిరేట్ ఆఫ్ షార్జా యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి కృత్రిమ మేధస్సు తో రూపొందించారు. వీటి సాయంతో సమాజానికి అందించే కీలక సేవలను మెరుగుపరుచనున్నారు. ముసల్లా ప్రాంతంలోని మున్సిపాలిటీ ప్రధాన భవనంలో మునిసిపల్ వ్యవహారాల విభాగం చైర్మన్ డాక్టర్ సులైమాన్ అబ్దల్లా బిన్ సర్హాన్ అల్ జాబీ, మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఒబైద్ సయీద్ అల్ తెనైజీ తదితరుల సమక్షంలో ఈ వేడుకలను నిర్వహించారు. అన్ని రంగాలలో షార్జా యొక్క సమగ్ర పురోగతికి అనుగుణంగా సేవలను అభివృద్ధి చేయనున్నట్లు అల్ తెనైజీ తెలిపారు. ఉద్యోగులలో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడం, మార్గదర్శక ఆలోచనలను ప్రత్యక్ష ప్రాజెక్టులుగా మార్చడం వంటి వాటి ప్రాముఖ్యతను ఆయన చెప్పారు.షార్జా మునిసిపాలిటీలో మానవ వనరుల విభాగం డైరెక్టర్ మరియు ఇన్నోవేషన్ టీమ్ హెడ్ రీమ్ అబ్దుల్లా అల్ రోస్సీ.. మునిసిపాలిటీ తన సృజనాత్మక కార్యక్రమాలలో ఒకటిగా "స్మార్ట్ పాత్" ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందని వెల్లడించారు. ఇది పబ్లిక్ పార్కింగ్ నిర్వహణలో తనిఖీ కార్యకలాపాలను రూపొందించడానికి మరియు ఆటోమేట్ చేయడానికి అలాగే డిపార్ట్‌మెంట్ వినియోగదారులచే తనిఖీ వాహనాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి సహాయపడే ఒక వినూత్న కార్యక్రమం అని పేర్కొన్నారు. షార్జా సిటీ మునిసిపాలిటీలో నిపుణులు రూపొందించిన  స్మార్ట్ లెన్స్ సిస్టమ్ ఆవిష్కరణ ద్వారా అధునాతన ఆప్టికల్ లాంగ్వేజ్ మోడల్‌ను ఉపయోగించి వాట్సాప్ అప్లికేషన్ ద్వారా మున్సిపాలిటీకి ఆడియో మరియు వీడియో ఫిర్యాదులు, పరిశీలనలను సౌకర్యవంతంగా సమర్పించడానికి నివాసితులను అనుమతిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com