మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- February 22, 2024
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 28వ ఎడిషన్ బుధవారం ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ బుక్ ఫెయిర్ మార్చి 2 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో దేవాదాయ, మతపరమైన వ్యవహారాల మంత్రి డాక్టర్ మహమ్మద్ సైద్ అల్ మమారి ముఖ్య అతిథి పాల్గొన్నారు. ఈ వేడుకకు సమాచార శాఖ మంత్రి, మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ప్రధాన కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా నాసర్ అల్ హర్రాసి హాజరయ్యారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో విద్యా సదస్సులు, ఉపన్యాసాలు, కవిత్వ సాయంత్రాలు మరియు చర్చా ప్యానెల్లు నిర్వహిస్తున్నారు. ఇందులో మేధావులు, రచయితలు మరియు సాహితీవేత్తలు పాల్గొంటారు. ప్రదర్శనలో పురాతన వస్తువులు, శిల్పాలు, మాన్యుస్క్రిప్ట్‌లు, గవర్నరేట్ చరిత్రకు సంబంధించిన విలక్షణమైన పత్రాలు, పర్యాటక ల్యాండ్‌మార్క్‌లపై దృశ్య ప్రదర్శనలు ఉన్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఒమన్ యూత్ ఎన్సైక్లోపీడియా (OYE)ని కూడా ప్రారంభించారు . పుస్తక ప్రదర్శనలో 34 దేశాల నుండి 847 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. బుక్ ఫెయిర్ వెబ్సైట్లో దాదాపు 269,000 అరబిక్ పుస్తకాలు, 200,000 విదేశీ పుస్తకాలు సహా 622,000 శీర్షికలు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









