రమదాన్: 10,000 వస్తువుల ధరలు తగ్గింపు
- February 22, 2024
యూఏఈ: 2024లో పవిత్ర రమదాన్ మాసానికి 35 మిలియన్ దిర్హామ్‌లను కేటాయించినట్టు.. దాదాపు 10,000 వస్తువుల ధరలను తగ్గించించినట్టు షార్జా కోఆపరేటివ్ సొసైటీ బుధవారం ప్రకటించింది. ఈ వస్తువులలో దాదాపు 80 శాతం అవసరమైన ఆహార ఉత్పత్తులు మరియు ఎమిరేట్ అంతటా ఉన్న తన 67 శాఖలలో అందుబాటులో ఉన్నాయని రిటైలర్ చెప్పారు. వంట నూనె, పిండి మరియు బియ్యం వంటి కీలకమైన కిరాణా వస్తువుల ధరలు 75 శాతం వరకు తగ్గుతాయని పేర్కొన్నారు. దీంతోపాటు వారపు ఆఫర్లు ఫిబ్రవరి 22 నుండి ప్రారంభ 10,000 కంటే ఎక్కువ వస్తువులపై మరిన్ని తగ్గింపుల ఆఫర్ ప్రారంభం అవుతుందన్నారు. ఈ ప్రచారంలో ప్రతి వారం రెండు సుజుకి డిజైర్ కార్లు, ఒక్కొక్కటి Dh5,000 విలువ చేసే 30 ఫర్నీచర్ గిఫ్ట్ కార్డ్‌లు, Dh300 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే దుకాణదారుల కోసం Dh1,000 విలువైన 32 షాపింగ్ గిఫ్ట్ కార్డ్‌లతో సహా గొప్ప బహుమతులు కూడా ఉన్నాయని షార్జా కోఆపరేటివ్ సొసైటీ సీఈఓ మజిద్ అల్ జునైద్ తెలిపారు. మరోవైపు మంగళవారం దుబాయ్‌కి చెందిన రిటైలర్ యూనియన్ కోప్ కూడా 50 శాతం నుండి 75 శాతం మధ్య 4,000 వస్తువులపై 75 శాతం వరకు తగ్గింపులను ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







