వివాదాస్పద వ్యాఖ్యలు.! లీగల్ నోటీసులు పంపిన త్రిష.!
- February 22, 2024
ఓ రాజకీయ ప్రముఖుడు సినీ నటి త్రిషనుద్దేశించి జుగుప్పాకరమైన వ్యాఖ్యలు చేశాడు. దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయ్. సోషల్ మీడియా వేదికగా త్రిష ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాదు, పరువు నష్టం దావా వేస్తూ.. సదరు రాజకీయ ప్రముఖునికి లీగల్ నోటీసులు పంపించింది. ఈ విషయమై పలువురు సినీ సెలబ్రిటీలు త్రిషకు అండగా నిలిచారు.
కాగా, గతంలో సహ నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై ఇలాగే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశమై మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ నటీనటులు త్రిషకు అండగా నిలిచారు.
ఆ కేసులో న్యాయస్థానం మన్సూర్ అలీ ఖాన్‌కి చివాట్లు కూడా పెట్టింది. తదనంతరం ఆ సీనియర్ నటుడు త్రిషకు క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి త్రిష రాజకీయ ప్రముఖునిచే ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు ఫేస్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిజానికి తన ప్రమేయం లేకుండానే త్రిష ఈ తరహా వివాదాల్లో ఇరుక్కుంటూ వుంటుంది. చాలా కాలం క్రితం త్రిష న్యూడ్ వీడియో కూడా అప్పట్లో సంచలనాత్మకమైంది. ప్రస్తుతం సీనియర్ నటీ మణుల్లో త్రిష చాలా బిజీయెస్ట్ హీరోయిన్ అని చెప్పొచ్చు.
వయసుతో సంబంధం లేకుండా కెరీర్లో బిజీగా గడుపుతోంది. మెగాస్టార్ చిరంజీవి తాజా మూవీ ‘విశ్వంభర’ సినిమాలో త్రిష నటిస్తోంది.
తాజా వార్తలు
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం









