యాక్షన్ గాళ్‌గా మారనున్న కియారా అద్వానీ.!
- February 22, 2024
తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తొలి సినిమాకే క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. అయితే, రెండో సినిమా ‘వినయ విధేయ రామ’తో అవుట్ అయిపోయింది.
ఆ తర్వాత బాలీవుడ్‌లో కియారా అద్వానీ అదృష్టం చెక్ చేసుకుంది. అప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన కియారాకి, తెలుగు ఎంట్రీ తర్వాత బాలీవుడ్ బాగా కలిసొచ్చింది.
‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ ఖాన్’ సినిమాతో అక్కడ సెన్సేషనల్ అయిపోయింది. ఆ తర్వాత చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.
ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతోన్న కియారా అద్వానీ, తాజాగా రణ్‌వీర్ సింగ్ హీరోగా రూపొందుతోన్న ‘డాన్ 3’ లో హీరోయిన్‌గా ఎంపికైంది.
ఈ సినిమా కోసం యాక్షన్ గాళ్ అవతారమెత్తబోతోందట కియారా అద్వానీ. హీరోతో సమానంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో నటించేందుకు సిద్ధమవుతోందట.
అన్నట్లు తెలుగులో మళ్లీ కియారా అద్వానీ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







