మూతపడ్డ లండన్ టవర్ బ్రిడ్జి

- June 02, 2016 , by Maagulf
మూతపడ్డ లండన్ టవర్ బ్రిడ్జి

122 సంవత్సరాల చరిత్ర ఉన్న లండన్‌లోని టవర్‌ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు గురువారం ప్రకటన జారీ చేశారు. లండన్‌లోని థేమ్స్‌ నదిపై ఉన్న టవర్‌ బ్రిడ్జి మరమ్మతుల కారణంగా మూడు నెలల పాటు మూసివేసి పనులు చేయనున్నారు. గతేడాది అక్టోబర్‌ నుంచే ఈ వంతెనపై భారీ వాహనాదారుల రాకపోకలను నిలిపివేశారు. కేవలం పాదచారులను, పర్యాటకులను మాత్రమే నడిచేందుకు అనుమతినిస్తున్నారు. రోజుకి దాదాపు 40 వేలమందికి పైగా ప్రజలు, 21వేల వాహనాలు ఈ వంతెనపై ప్రయాణిస్తారు. దీని మరమ్మతులు పూర్తయ్యేంత వరకు వాహనదారులు వేరే రహదారుల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com