వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న మహేష్
- June 02, 2016
'ఊపిరి' సినిమాతో లేటెస్ట్ గా హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా భావిస్తున్న ఈ సినిమాను తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. వంశీ చెప్పిన కథ విని మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. జూన్ మొదటి వారంలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు.
ప్రస్తుతం వంశీ అమెరికాలో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుండగా, మహేష్ లండన్ లో ఫ్యామిలీ టూర్ లో ఉన్నాడు. వీళ్లిద్దరూ వచ్చాక మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మహేష్ ఇండియాకు వచ్చిన వెంటనే మురుగదాస్ మూవీ షూటింగ్ తో బిజికానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది.
ఇక తాజాగా వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా కూడా ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోవడం విశేషం. మొత్తానికి తమిళమార్కెట్ పై మహేష్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







