మొరోక్కన్ చికెన్ మసాలా
- June 02, 2016
కావలసిన పదార్థాలు: చికెన్ - అరకేజీ, ఉల్లిపాయలు - 2, టమోటాలు -2, పెరుగు - అరకప్పు, పసుపు - పావు టీ స్పూను, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 6, వెల్లుల్లి రేకలు - 5, అల్లం ముక్క - అరంగుళం, మిరియాలు - 8, మెంతులు, జీలకర్ర, గసగసాలు - 1 టీ స్పూను చొప్పున, కొత్తిమీర - గుప్పెడు, లవంగాలు, యాలకులు - 2 చొప్పున, దాల్చినచెక్క - చిన్న ముక్క, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు నిమ్మరసం, పెరుగు, ఉప్పు, పసుపు పట్టించి పక్కనుంచాలి. ఎండుమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలు వేగించి చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి. నూనెలో ఉల్లి తరుగు దోరగా వేగించి, టమోటా ముక్కలు కూడా వేసి, అవి మెత్తబడ్డాక మసాల పేస్టు కలపాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు కలిపి, రెండు నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి మూతపెట్టి చిన్నమంటపై మగ్గించాలి. దించేముందు మరోసారి నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లాలి. తందూరి, పరాటాలతో మంచి కాంబినేషన్.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







