రికార్డుల్లోకి ఎక్కిన విశాఖ విమానాశ్రయం
- June 29, 2015
విశాఖ విమానాశ్రయం అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా ప్రశంసలందుకునే స్ధితికి చేరింది. తాజాగా మిలియన్ ట్రేడ్ మార్క్‌ని అధిగమించి శభాష్ అనిపించుకుంది. ఈవిమానాశ్రయంలో ఎయిరిండియా, ఎయిర్‌ఆసియా, ఎయిర్‌కోస్తా, మలిందో, సిల్క్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు దేశీయ అంతర్జాతీయ విమానసర్వీసులు అందిస్తున్నాయి. హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, చెన్నై, కోల్‌కతా, ముంబయ్, బెంగుళూరు, ఢిల్లీ వంటి విమానాశ్రయాలతో పాటు దుబాయ్, కౌలాలంపూర్, సింగపూర్, పోర్టుబ్లెయిర్‌లకూ విమాన సర్వీసులు ఊపందుకున్నాయి. 2012-13 సంవత్సరంలో తొలి సారి ప్రయాణికుల సంఖ్య మిలియన్‌మార్కుకు చేరుకుంది. రాష్ట్ర విభజన ఉద్యమాలు, సమ్మెలు, హుద్ హుద్ తుపాను ప్రభావం బాగా చూపింది. తర్వాత రాష్ట్రం రెండుగా చీలిన తరుణంలో 2014-15 లో ప్రయాణికుల రద్దీ ఎలా వుంటుందోనని అధికారులు ఆలోచనలోపడ్డారు. అయితే దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరగడంతో అధికారులు ఊహించనంతగా రద్దీ పెరిగింది. తాజాగా ఈసంఖ్య 11 లక్షల ప్రయాణికులను అధిగమించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వినోద్‌కుమార్‌శర్మ విశాఖ విమానాశ్రయం డెరైక్టర్ విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు రావడానికి అవకాశాలున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







