వేడి నుంచి ఉపసమనం కలగాలంటే
- June 02, 2016
వేడి నుంచి సాంత్వన
విపరీతమైన ఎండ వేడి వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వేడిని దూరం చేసుకోవాలి. ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలు వేడిని దూరం చేసి సాంత్వన అందిస్తాయి.
గులాబీలు : ఈ రేకల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వాటిని నూనెల్లో, సబ్బుల తయారీలోనూ వాడుతుంటారు. ఎండలో కమిలిన చర్మం తిరిగి జీవంతో వెలిగిపోవాలంటే.. నీడలో గులాబీరేకలని ఎండబెట్టి, వాటితో టీ తయారు చేసుకుని తాగుతూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది. వేడి నుంచి సాంత్వన అందుతుంది. డయేరియా వంటి సమస్యలున్నా తగ్గిపోతాయి.
పుదీనా: పుదీనా ఆకుల్ని ఈ కాలంలో ఏ రూపంలో తీసుకున్నా ఫర్వాలేదు. పుదీనానీ చట్నీగా చేసుకోవచ్చు, సలాడ్లలో వేసుకోవచ్చు. డికాక్షన్లో ఆకులు వేసి టీలానూ కాచుకుని తాగొచ్చు. ఎలా తీసుకున్నా దాని ఫలితాలు అమోఘం. వేసవిలో తలెత్తే తలనొప్పీ, వికారాలతోపాటూ ఒత్తిడీ, నీరసం వంటివి రాకుండా పుదీనా చూస్తుంది.
ఉసిరి: ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒంట్లో వేడి పెరగకుండా ఉంటుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తుంది. దీన్నుంచి విటమిన్ సి అందుతుంది. రోగనిరోధక శక్తీపెరుగుతుంది.
తులసి: ఈ కాలంలో చెమట రూపంలో లవణాలని కోల్పోతుంటాం మనం. దాంతో వికారం, తలనొప్పి వంటి అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. గుప్పెడు తులసి ఆకుల రసాన్ని మనం ఏ రూపంలో తీసుకున్నా ఎ విటమిన్ పుష్కలంగా అందడంతో పాటూ, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాల భర్తీ తేలిగ్గా జరుగుతుంది. ముఖ్యంగా రక్తహీనత రాకుండా చేసే ఇనుము దీని నుంచి పుష్కలంగా అందుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







