ధైరాయిడ్‌ని ఈ డైట్‌తో కంట్రోల్ చేయొచ్చా.!

- February 23, 2024 , by Maagulf
ధైరాయిడ్‌ని ఈ డైట్‌తో కంట్రోల్ చేయొచ్చా.!

వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ఇది జీవక్రియపై ముఖ్యంగా ప్రభావం చూపుతుంది. అలాగే, ఊబకాయం కూడా థైరాయిడ్ వ్యాధి గ్రస్థుల్ని వేధించే సమస్యే. ఒక్కసారి థైరాయిడ్ ఎటాక్ అయితే, జీవిత కాలం మందులు వాడాల్సిందేనా.? అంటే తప్పదు మరి.
కానీ, డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు. ధైరాయిడ్‌కి పూర్తిగా నియంత్రించలేకపోయినా.. కంట్రోల్‌లో వుంచుకోవచ్చు. ఆ ఫుడ్ డైట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
థైరాయిడ్ వున్నవాళ్లు వంట నూనె విషయంలో ముఖ్యంగా జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. కాస్త కష్టమే అయినా కొబ్బరి నూనెతో వండిన వంటకాలను తింటే మంచిదని చెబుతున్నారు.
అలాగే కొబ్బరిని రోజూ డైట్‌లో చేర్చుకోవడం కూడా వుత్తమం. కొబ్బరి ధైరాయిడ్ స్థాయిని అదుపులో వుంచేందుకు తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అందుకే రోజూ ఒక్క చెంచాడు కొబ్బరి అయినా డైట్‌లో చేర్చుకోవడం వుత్తమం.
పండ్లలో జామకాయలు ధైరాయిడ్ వ్యాధిగ్రస్థుల పాలిట వరంగా చెబుతున్నారు. అలాగే ఉసిరి, నారింజలో సి విటమిన్ ఎక్కువగా వుంటుంది. వీటిని కూడా డైలీ డైట్‌లో చేర్చుకోవాలి.
గుమ్మడి గింజల్లో పుష్కలంగా వుండే జింక్ ధైరాయిడ్ స్థాయిని కంట్రోల్‌ చేస్తుంది. అందుకే గుమ్మడి గింజలతో చేసిన వంటకాలను కూడా థైరాయిడ్ వ్యాధిగ్రస్థులు తీసుకుంటే మంచిది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com