గాజా యుద్ధ వాతావరణం పై ఒమన్ ఆందోళన
- February 24, 2024
మస్కట్: తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో మానవ హక్కులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అనుసరిస్తున్న చర్యలకు సంబంధించి హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఒమన్ సుల్తానేట్ ఆందోళన వ్యక్తం చేసింది. “75 సంవత్సరాలకు పైగా, పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ వారిపై చేసిన ఆక్రమణ, అణచివేత, అన్యాయం మరియు రోజువారీ అవమానాల క్రింద జీవిస్తున్నారు. అదే సమయంలో, పాలస్తీనా ప్రజలు తమ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం ద్వారా వారి ఆకాంక్షలను సాధించడంలో అంతర్జాతీయ సమాజం మరియు అంతర్జాతీయ సంస్థలు విఫలమయ్యాయి. నాలుగు నెలల క్రితం గాజాలో అత్యంత భయంకరమైన దురాగతాలు, మారణహోమ చర్యలు జరిగాయి. వీటి ఫలితంగా 29 వేల మందికి పైగా అమరులయ్యారు. 68 వేల మందికి పైగా గాయపడ్డారు. 2.2 మిలియన్లకుపైగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. వారు పేదరికంలో దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారు." అని పేర్కొన్నది. నెదర్లాండ్ రాజ్యంలోని ఒమన్ సుల్తానేట్ రాయబారి హిస్ ఎక్సలెన్సీ డా. షేక్ అబ్దుల్లా బిన్ సలేం అల్ హరితి, నాటి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం (77/247)కి ఒమన్ సుల్తానేట్ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇజ్రాయెల్ ను నియంత్రించాలని, పాలస్తీనా భూభాగాలను తిరిగి ఇప్పించాలని, యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని, జరిగిన నష్టానికి పాలస్తీనా ప్రజలకు ఆర్థిక సాయాన్ని అందించేలా శాశ్వత పరిష్కారం చూపాలని ఒమన్ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!









