పార్ట్‌నర్ షిప్ వెనుక అసలు సంగతి

- June 02, 2016 , by Maagulf
పార్ట్‌నర్ షిప్ వెనుక అసలు సంగతి

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి చిరంజీవి నాగార్జున బిజినెస్ పార్ట్‌నర్స్ గా మారి ఒక ఫుట్ బాల్ టీమ్ కొనుగోలు చేయడం వెనుక పనిచేసిన నాగార్జున మైండ్ స్కెచ్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ప్రతి ఏటా జరిగే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నీలో సచిన్ సహయజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టులో చిరంజీవి, నాగార్జున, అల్లుఅరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ ఉమ్మడిగా వాటా కొనేయడం వెనుక నాగార్జున మాస్టర్ మైండ్ ఉంది అంటున్నారు.
గతంలో నాగార్జున టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఓ రేసింగ్ జట్టు కొన్న విషయం తెలిసిందే. అయితే అందులో మరీ పెద్ద ఆదాయం రాకపోవడంతో
ఇప్పుడు భారత్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న ఫుట్ బాల్ లీగ్ మీద కన్నేశాడునాగ్.
నిమ్మగడ్డ ప్రసాద్ బిజినెస్ మైండ్ సహాయంతో అల్లు అరవింద్ ను చిరంజీవిని కూడ భాగ స్వాములుగా చేసుకుని ఈ కేరళ బ్లాస్టర్స్ టీమ్ ను కొనడం వెనుక నాగ్ ముందు చూపు ఉంది అని అంటున్నారు.
ఫుట్ బాల్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల్లో ఆదరణ ఉన్న గేమ్ కావ్వడంతో పాటు భారత్ లాంటి పెద్ద దేశంలోనూ సాకర్ ను విస్తరించడానికి మంచి అవకాశాలున్నాయి అన్న విషయాన్ని నాగ్ పసిగట్టాడు అని టాక్. ఈమాస్టర్ మైండ్ తో బిజినెస్ మైండ్ ఉన్న నాగ్ వేసిన మాస్టర్ బిజినెస్ ప్లాన్ ఇప్పడు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
ఇది ఇలా ఉండగా టాలీవుడ్లో అత్యంత తెలివైన ప్రొడ్యూసర్ గా పేరుగాంచిన అల్లుఅరవింద్ తన కొడుకు అల్లుఅర్జున్ కేరళలో నెమ్మదిగా పెద్ద స్టార్ అయిపోతున్నానేపధ్యంలో ఇప్పుడిక ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే టీమ్ ను కొనుగోలు చేస్తే అది వ్యాపార పరంగానే కాకుండా తనకొడుకు ఫాలోయింగ్ మరింత పెంచడానికి ఉపయోగపడుతుంది. అన్న ఉద్దేశంతో నాగ్ తో చేయి కలిపాడు అనే వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా నాగార్జున కేరళ బ్లాస్టర్స్ టీమ్ ను చిరంజీవి అరవింద్ లతో కొనడం ఇప్పుడు టాలీవుడ్ కి షాకింగ్ న్యూస్..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com