‘ఆపరేషన్ వాలైంటైన్’ అస్సలు తగ్గేదేలే.!
- February 24, 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న ‘ఆపరేషన్ వాలైంటైన్’ చిత్రాన్ని అంత ఆషా మాషీగా వదిలిపెట్టడం లేదు. ఏదో పెద్ద స్కెచే వేశారీ సినిమాపై.
వరుణ్ తేజ్ వివాహం తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా వున్నాయ్. ఆ అంచనాల్ని అందుకునే ప్రయత్నంగా ప్రమోషన్లు ఊదరగొట్టేస్తున్నారు. చాలా కష్టపడుతున్నాడు వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం.
సినిమా షూటింగ్ టైమ్‌లోనూ చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ప్రమోషన్ల విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు. వరుసగా ఇంటర్వ్యూలిస్తుండడంతో పాటూ, సినిమాని జనంలోకి తీసుకెళ్లే ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలి పెట్టడం లేదు.
మార్చి 1న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటూ, హిందీలోనూ ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా విడుదలవుతోంది.
కాగా, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా ప్లాన్ చేశారు ‘ఆపరేషన్ వాలైంటైన్’ టీమ్. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండడంతో సినిమా రేంజ్ ఇంకా మారిపోయింది.
హైద్రాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్స్‌లో ఈ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. శక్తి ప్రతాప్ సింగ్ హుడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







