‘హనుమాన్’ ఆట ఆగేదేలే.!
- February 24, 2024
సంక్రాంతి సినిమాల్లో అంచనాల్లేకుండా.. వచ్చిన చిన్న సినిమా ‘హనుమాన్’. పెద్ద సినిమాలతో పోటీగా బరిలోకి దిగిన ఈ సినిమాని ఎలాగైనా తొక్కేయాలని ప్రయత్నించారు కానీ, జరగలేదు. ఎంత తొక్కేయాలనుకున్నారో.. అంత కన్నా ఎక్కువగా లేచింది.
పండగ సెలవుల్లో ఫుల్.. హౌస్ ఫుల్స్‌తో ‘హనుమాన్’ కలెక్షన్ల జోరు కురిపించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. ఈ మధ్య కాలంలో ఇన్ని వారాలు ధియేటర్లలో వున్న సినిమాగా ‘హనుమాన్’ రికార్డు సృష్టించింది.
ఒక్కసారి చూసినవాళ్లే ఆ విజువల్స్ కోసం మళ్లీ మళ్లీ ‘హనుమాన్’ని వీక్షించడం విశేషం. ఇక, ఇప్పుడు సినిమా టిక్కెట్ రేటు తగ్గించి మరో ట్రిక్ ప్లే చేశారు. అందులోనూ సక్సెస్ అయ్యింది ‘హనుమాన్’ సినిమా.
తక్కువ టికెట్ రేటును కూడా హనుమాన్ వీక్షకులు యూజ్ చేసుకున్నారు. దాంతో, మరో వారం రోజులు ఈ సినిమాని తక్కువ ధరకే ధియేటర్లలో వుంచాలని యాజమాన్యాలు డిసైడ్ అయ్యాయ్. సింగిల్ స్ర్కీన్‌పై 99 రూపాయల టిక్కెట్లు ధర కాగా, బిగ్ స్ర్కీన్స్‌పై 112 రూపాయలుగా వుంది.
ఈ నెల 29 వరకూ ఇవే టిక్కెట్ ధరలు కొనసాగనున్నాయ్. ఇక, ఆ తర్వాత గ్యాప్ లేకుండానే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది ‘హనుమాన్’. మార్చి 2 నుంచి ఓటీటీలో ప్రసారం చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఓటీటీలోనూ ఈ సినిమాని మళ్లీ మళ్లీ వీక్షించేందుకు ఆడియన్స్ రెడీగా వున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!