నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ
- February 27, 2024
న్యూఢిల్లీ: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. వీళ్లతో మోడీ ముచ్చటించారు. ఈ వ్యోమగాములను 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే నాలుగు శక్తులుగా అభివర్ణించారు మోడీ. కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గగన్‌యాన్ ప్రాజెక్టు పురోగతిని మోడీ పరిశీలించారు.
21వ శతాబ్దంలో భారత్ ప్రపంచస్థాయి దేశంగా అవతరిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పురోగమిస్తోందని తెలిపారు. చంద్రయాన్, గగన్‌యాన్ వంటి ప్రాజెక్టుల్లో మహిళల పాత్ర ఎనలేనిదని మోడీ కొనియాడారు. వారి భాగస్వామ్యం లేనిదే ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యేవి కాదని అన్నారు. గగన్‌యాన్ మిషన్‌లో చాలా వరకు భారత్‌లో తయారైన పరికరాలను ఉపయోగించడం గర్వకారణమని చెప్పారు.
“దేశాభివృద్ధి ప్రయాణంలో కొన్ని ఘట్టాలు భవిష్యత్‌ను నిర్దేశించేవిగా ఉంటాయి. ఇది అలాంటి క్షణమే. గగన్‌యాన్ మిషన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఇప్పుడు దేశానికి పరిచయం అయ్యారు. వీరు నలుగురు వ్యక్తులు మాత్రమే కాదు, 140 కోట్ల మంది ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు స్పేస్‌లో అడుగుపెట్టనున్నారు. కానీ ఈసారి వ్యోమగాములను పంపించే రాకెట్ మనం సొంతంగా తయారు చేసుకున్నది. టైమ్, కౌంట్‌డౌన్ అన్నీ మనవే.”
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







