రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోతుందా.?

- February 27, 2024 , by Maagulf
రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోతుందా.?

కొందరికి ప్రతీరోజూ తలస్నానం చేసే అలవాటుంటుంది. ప్రస్తుత రోజుల్లో అయితే, పొల్యూషన్ గట్రా రకరకాల కారణాలతో ప్రతీరోజూ తలస్నానం చేయాల్సి వస్తోంది.

అయితే, అలా ప్రతీరోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు ఊడిపోతుందా.? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. కానీ, రోజూ తలకు స్నానం చేయడం వల్ల జుట్టు ఊడిపోదని నిపుణులు చెబుతున్నారు.

పైగా ప్రతీరోజూ తల స్నానం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని అంటున్నారు. ఎందుకంటే, మాడు శుభ్రంగా వుంటుంది. చెమటతొ నాటేచ తలకు పట్టిన దుమ్ము ధూళి.. వంటివి శుభ్రమైపోవడం వల్ల చుండ్రు తదితర ఫంగల్ ఇన్షెక్షన్లు రాకుండా వుంటాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే, జుట్టు రాలిపోవడానికి కారణాలే వేరే. అధిక గాఢత కలిగిన షాంపూల వాడకమే జుట్టు రాలిపోవడానికి కారణం. గాఢత తక్కువ వున్న షాంపూలతో రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు సమస్యలేమీ తలెత్తవు.

నేచురల్ షాంపూగా పిలవబడే కుంకుడు కాయలతో తలస్నానం చేస్తే ఇంకా మంచిదని అంటున్నారు. తల స్నానం తర్వాత హెయిర్ కండిషన్లు వాడే అలవాటు వుంటే.. అది కాస్త తగ్గించుకోమని చెబుతున్నారు.

జుట్టుకు నేచురల్ కండిషనర్ కొబ్బరి నూనె. అలోవెరా ఆయిల్ కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ ఆయిల్‌తో రెండు రోజులకోసారి హెయిర్‌ని మసాజ్ చేస్తూ వాడితే మంచి ఫలితాలుంటాయ్. ఎటువంటి జుట్టు సమస్యలూ రావనేది నిపుణుల సలహా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com