ఇజ్రాయెల్ బెదిరింపులను ఖండించిన ఖతార్

- February 28, 2024 , by Maagulf
ఇజ్రాయెల్ బెదిరింపులను ఖండించిన ఖతార్

జెనీవా: దక్షిణ గాజాలోని రఫా నగరంపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ బెదిరింపులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఖతార్ మరోసారి స్పష్టం చేసింది. గాజా స్ట్రిప్ నుండి 1.5 మిలియన్ల మంది నిర్వాసితులకు చివరి ఆశ్రయంగా మారిన నగరంలో మానవతా విపత్తు గురించి హెచ్చరించింది. ఇజ్రాయెల్ దళాలు రఫాపై దాడి చేయకుండా మరియు మారణహోమానికి పాల్పడకుండా మరియు గాజా స్ట్రిప్ నుండి పాలస్తీనా ప్రజలను బలవంతంగా తరలించడానికి ప్రణాళికలను అమలు చేయకుండా నిరోధించడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని, అంతర్జాతీయ చట్టం మరియు అంతర్జాతీయ మానవతా చట్టం ద్వారా పౌరులకు పూర్తి రక్షణ కల్పించాలని పిలుపునిచ్చింది. జెనీవాలో జరిగిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మరియు అంతర్జాతీయ మానవతా చట్టంపై చర్చ సంధర్బంగా నిర్వహించిన ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో మానవ హక్కుల పరిస్థితిపై అత్యున్నత స్థాయి మంత్రివర్గ కార్యక్రమానికి ముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి హెచ్ఈ లోల్వా బింట్ రషీద్ అల్ ఖాటర్ ఈ మేరకు పిలుపునిచ్చారు. గత 75 సంవత్సరాలుగా, ఇజ్రాయెల్ మానవ హక్కులకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ చట్టాలు మరియు ఒప్పందాలను ఉల్లంఘించిందని మరియు పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా అన్ని ఉల్లంఘనలు మరియు నేరాలకు పాల్పడిందని ఆమె ఎత్తి చూపారు. దశాబ్దాలుగా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దురాక్రమణ ఆగలేదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com