దుబాయ్ గ్లోబల్ విలేజ్.. ర‌మదాన్ కొత్త స‌మ‌యాలు

- February 29, 2024 , by Maagulf
దుబాయ్ గ్లోబల్ విలేజ్.. ర‌మదాన్ కొత్త స‌మ‌యాలు

యూఏఈ: దుబాయ్  గ్లోబల్ విలేజ్  ర‌మ‌దాన్ నెల కోసం కొత్ స‌మ‌యాల‌ను ప్ర‌క‌టించింది. సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు తెరిచి ఉంటుంద‌ని తెలిపారు. సందర్శకులు ఇఫ్తార్ మరియు సుహూర్ సమర్పణలను వివిధ రకాల వంటకాలలో అనేక ఎంపికలను గ్లోబల్ విలేజ్ లో ఆస్వాదించవ‌చ్చు. అతిథులు సరికొత్త ర‌మ‌దాన్ వండర్స్ సౌక్‌లో కూడా షాపింగ్ చేయవచ్చు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించే ప్ర‌త్యేక డ్రాల‌లో మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా అనేక బ‌హుమ‌తుల‌ను అందుకోవ‌చ్చు. గ్లోబల్ విలేజ్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి సంద‌ర్శ‌కులు ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు.  పవిత్ర ర‌మ‌దాన్ మాసంలో ప్రతి శుక్రవారం విజేతలు ప్రకటిస్తారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com