మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సిఎం రేవంత్ రెడ్డి
- February 29, 2024
హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏకంగా 11,062 పోస్టులతో జారీ అయిన ఈ నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉండగా.. ఎస్జీటీ పోస్టులు 6,508 ఖాళీలు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రేవంత్ రెడ్డి సర్కారు రద్దు చేసింది. గతేడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో బిఆర్ఎస్ ప్రభుత్వం నియామక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసి, అదనంగా 5 వేల పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులతో రేవంత్ రెడ్డి కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని సీఎం స్పష్టతనిచ్చారు. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







