వివేకా హత్య కేసు..వాళ్లను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు..సునీత
- March 01, 2024
న్యూఢిల్లీ: పాలిటిక్స్ లో హత్యా రాజకీయాలు ఉండకూడదని దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య కేసు గురించి అడుగుతున్నారని చెప్పారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తాను చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ సరిగ్గా విచారణ జరపాలని… కానీ, ఆ పని చేయడం లేదని, వారిపై ఏ ప్రెజర్ ఉందో తనకు తెలియదని చెప్పారు. ట్రయల్ జరిగితేనే హంతకులకు శిక్ష పడుతుందని తెలిపారు. అవినాశ్, భాస్కర్ రెడ్డిలు తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని శిక్షించాలని అన్నారు.
కర్నూలులో అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లి, అరెస్ట్ చేయకుండా సీబీఐ అధికారులు వెనక్కి వచ్చారని… ఎవరినైనా అరెస్ట్ చేయకుండా సీబీఐ వెనక్కి రావడం ఎప్పుడైనా జరిగిందా? అని సునీత ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. వీళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని… వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దని సునీత పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర
- ఎగ్జిబిషన్ లో 264 మంది పోకిరీలకు బుద్ధి చెప్పిన షీటీమ్స్
- పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!









