యూఏఈలో జీతాలు తీసుకుంటున్న బెగ్గర్స్..!

- March 06, 2024 , by Maagulf
యూఏఈలో జీతాలు తీసుకుంటున్న బెగ్గర్స్..!

యూఏఈ: బెగ్గింగ్ కోసం వేడుకుంటున్న పేద వ్యక్తిని చూసిన తర్వాత మీ హృదయం ద్రవిస్తుంది. కానీ అతను/ఆమె మీ కంటే ధనవంతులయ్యే అవకాశం ఉందన్న విషయం తెసుసా? వేర్వేరు సందర్భాల్లో దుబాయ్ పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి  Dh60,000,  Dh30,000 నగదుతో స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు కేవలం బెగ్గింగ్ ద్వారానే ఆ మొత్తాన్ని కూడబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒక మహిళ తన బిడ్డను ఉపయోగించి సానుభూతి పొందడం ద్వారా.. వేల దిర్హామ్‌లను సంపాదించింది. ఇద్దరు మహిళలూ విజిట్ వీసాపై యూఏఈకి వచ్చిన వారే కావడం గమనార్హం.  తాము అరెస్టు చేసిన యాచకుల్లో 99 శాతం మంది భిక్షాటనను ‘వృత్తి’గా భావిస్తున్నారని దుబాయ్ పోలీసులు తెలిపారు. పవిత్ర రమదాన్ మాసానికి ముందు పోలీసులు యాచక వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.   అదే సమయంలో కొందరిని బెగ్గింగ్ కోసం కొన్ని ముఠాలు రిక్రూట్ చేసుకొని వారిని విజిట్ వీసాలపై యూఏఈకి తీసుకొస్తున్నట్లు షార్జా పోలీసులు ఇంతకుముందు తెలిపారు.  దేశంలోకి తీసుకువచ్చిన వ్యక్తులకు ముఠాలు నెలవారీ వేతనం అందిస్తారు. గత నాలుగేళ్లలో దుబాయ్ పోలీసులు మొత్తం 1,701 మంది యాచకులను పట్టుకున్నారు. ఒక్క 2023లోనే దాదాపు 500 మంది యాచకులను అరెస్టు చేశారు. యూఏఈలో భిక్షాటన అనేది ఒక నేరం. దీనికి 5,000 దిర్హామ్ జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధించబడుతుంది. బిచ్చగాళ్ల ముఠాను నిర్వహించడం లేదా భిక్షాటన కోసం దేశం వెలుపలి వ్యక్తులను రిక్రూట్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు 100,000 దిర్హామ్‌ల జరిమానాను విధిస్తారు. పర్మిట్ లేకుండా నిధులను సేకరించడం చేస్తే Dh500,000 వరకు జరిమానా విధిస్తారు. అనుమానాస్పద కార్యకలాపాలు మరియు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నివాసితులను పోలీసులు కోరారు.

ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు:

అబుదాబి: 999 లేదా 8002626

దుబాయ్: 901, 800243 లేదా 8004888

షార్జా: 901, 06-5632222 లేదా 06-5631111

రాస్ అల్ ఖైమా: 07-2053372

అజ్మాన్: 06-7034310

ఉమ్ అల్ క్వైన్: 999

ఫుజైరా: 09-2051100 లేదా 09-2224411

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com