ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి ట్రాఫిక్ సిగ్నల్ డ్రోన్‌లు

- March 06, 2024 , by Maagulf
ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి ట్రాఫిక్ సిగ్నల్ డ్రోన్‌లు

యూఏఈ: దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లగలిగే స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ డ్రోన్ త్వరలో యూఏఈలో ప్రారంభించబడుతుంది. మంగళవారం దుబాయ్‌లో ప్రారంభమైన వరల్డ్ పోలీస్ సమ్మిట్ (డబ్ల్యుపిఎస్) ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. "అత్యవసర సమయంలో లేదా కూడలి వద్ద ట్రాఫిక్ లైట్లు చెడిపోయినప్పుడు దీనిని తాత్కాలిక ట్రాఫిక్ సిగ్నల్‌గా ఉపయోగించవచ్చు" అని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. "ప్రస్తుతం ఇది ప్రోటోటైప్. కానీ తుది తనిఖీల ద్వారా ఉత్పత్తిని ప్రారంభించాలని మేము ఆశిస్తున్నాము." అని వివరించారు. మూడు రోజుల సమ్మిట్ FBI, NYPD మరియు ఇంటర్‌పోల్‌తో సహా 138 దేశాల నుండి ప్రతిష్టాత్మక దళాలు పాల్గొంటున్నాయి.  తాజా పోలీసింగ్ టెక్, సైబర్ సెక్యూరిటీ మరియు రోడ్ సేఫ్టీ WPSలో ఒకే చోటకు చేర్చాయి. నేరాల నివారణ, ఫోరెన్సిక్స్ మరియు మొబిలిటీతో సహా వివిధ అంశాలపై చర్చకు ఇది వేదికైంది. 3డి ప్రింటెడ్ ట్రాఫిక్ సిగ్నల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 నిమిషాల వరకు పని చేస్తుందని, పోలీసు పెట్రోలింగ్ ఆ ప్రాంతానికి చేరుకునే వరకు ఇది అక్కరకొస్తుందన్నారు. WPS దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో మార్చి 7 వరకు జరుగుతుంది.  ప్రవేశం ఉచితం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com