తూచ్.! అంతా వుత్తదే.! ప్రబాస్ ప్యాన్స్ డీలా.!
- March 06, 2024
ప్రబాస్ సినిమాల విషయంలో ఏదీ అనుకున్న టైమ్‌కి జరగడం లేదు. అన్నీ వాయిదాల పర్వమే నడుస్తోంది. తాజాగా ‘కల్కి’ సినిమా విషయంలోనూ అదే జరుగబోతోందనుకోవచ్చేమో.
ఈ సినిమాని మే 9కి రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. అందుకు ఎంతో సమయం కూడా లేదు. ఆ సంగతి అలా వుంటే.. ఈ శివరాత్రికి ‘కల్కి’ నుంచి ఓ చిన్నపాటి టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నారంటూ కొన్ని రోజులుగా రోజుకో కథనం వేడి వేడిగా వండి వడ్డిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, అదంతా తూచ్.! అలాంటి ప్రచారంతో మాకెలాంటి సంబంధం లేదు.. సినిమా రిలీజ్‌కి సరిగ్గా నెలరోజులు ముందు నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేస్తామంతే.. అన్నట్లుగా చిత్ర యూనిట్ నుంచి సంకేతాలు అందుతున్నట్లు తాజా సమాచారం.
ఈ న్యూస్‌తో ప్రబాస్ ఫ్యాన్స్ ఖుషీ కాస్త ఢీలా అయిపోయింది. శివరాత్రికి తమ అభిమాన హీరో సినిమా నుంచి ఏదో అప్‌డేట్ రాబోతుందని పండగ చేసుకుంటున్న ప్రబాస్ ఫ్యాన్స్‌కి నెత్తిన బొప్పి కట్టేలా అయిపోయింది ఈ తాజా గాసిప్. అయితే, నిజంగానే ఇది చిత్ర యూనిట్ చెప్పిన మాటేనా.? లేదంటే. ఇదీ ప్రచారంలో ఓ భాగమేనా.? అనేది తెలియాల్సి వుంది.
ఏది ఏమైతేనేం, అనుకున్న టైమ్‌కి ‘కల్కి’ రిలీజ్ అయితే మాత్రం అది నిజంగా ఫ్యాన్స్‌కి పండగే. ఎందుకంటే, అత్యంత భారీ బడ్జెట్ విజువల్ వండర్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!