ఆదా శర్మ.! వివాదంతో మళ్లీ విజయం దక్కించుకోనుందా.?
- March 06, 2024
వివాదాలు కొన్ని సినిమాల్ని విజయాల బాట పట్టిస్తాయని నిరూపించిన సంగతి తెలిసిందే. గతంలో అలాంటి ఓ వివాదాస్పద చిత్రంలో నటించిన ముద్దుగుమ్మ ఆదాశర్మ. అంతకు ముందు వరకూ కేవలం తన గ్లామర్‌తోనే కట్టి పడేసిన ఆదా శర్మ, ‘ది కేరళ స్టోరీస్’ సినిమాతో సెన్సేషనల్ అయిపోయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మళ్లీ ఆ తరహా చిత్రంతోనే రాబోతోంది. అంతకు మించిన వివాదాలూ క్రియేట్ చేయబోతోంది. ఇంతకీ ఏంటా సినిమా.? ఏమా కథ.? అనుకుంటున్నారా.?
సినిమా పేరు ‘బస్తర్’. లేదా ‘బాస్టర్’ ఎలా పిలిచినా ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథ, కథనాల ప్రకారం చూస్తే అత్యంత వివాదాస్పద చిత్రంగా వార్తల్లోకెక్కింది ఈ సినిమా.
14 ఏళ్ల క్రితం ఛత్తీస్‌ఘడ్ మావోయిస్ట్‌ల దాడిలో ఏకంగా 75 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నిమిత్తం ఢిల్లీలో ఓ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్ధులు సెలబ్రేషన్లు జరుపుకున్న వార్త అప్పట్లో సంచలనమైంది.
ఈ నేపథ్యంతో రూపొందిన కథే ఈ ‘బస్తర్’ సినిమా అని లేటెస్ట్ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!