శర్వా 36.! వేగం పెంచాడుగా.!
- March 06, 2024
ఈ మధ్య శర్వానంద్ నుంచి సినిమాలు రావడం తగ్గిపోయాయ్. పెళ్లి పేరు చెప్పి, శర్వా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు దాన్నంతటినీ కవర్ చేస్తూ, ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టేసేలా వున్నాడు. వరుసగా రెండు ప్రాజెక్టులు లైన్‌లోకి తెచ్చేశాడు.
వాటిలో ఆల్రెడీ శ్రీరామ్ ఆదిత్యతో రూపొందబోయే సినిమా సమ్మర్ రిలీజ్‌ని ప్లాన్ చేసుకుంది. ఈ సినిమాకి ‘మనమే’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు.
అలాగే, ఇదే సందర్భంగా మరో కొత్త సినిమానీ శర్వా ప్రకటించేశాడు. అదే శర్వా 36. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ, తనకు బాగా కలిసొచ్చిన యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతుండడమే విశేషం.
గతంలో యూవీ క్రియేషన్స్‌లో శర్వా చేసిన ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘మహానుభావుడు’ సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయ్. అలాగే ఇప్పుడీ సినిమా మంచి విజయం తెచ్చిపెడుతుంది శర్వానంద్‌కి అని అంచనా వేస్తున్నారు.
‘లూజర్’ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన అభిలాష్ కంకర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా టైటిల్ తదితర వివరాలు తెలియాల్సి వుంది కానీ, బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆసక్తి కలిగిస్తోంది. బైక్ రైడర్‌గా శర్వా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని ఫస్ట్‌లుక్ పోస్టర్ ద్వారా మేకర్లు హింట్ ఇచ్చారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







