కొత్త ప్లాట్‌ఫారమ్..30 రోజుల నుండి 5కు తగ్గిన రెసిడెన్సీ వీసా ప్రక్రియ
- March 07, 2024
దుబాయ్: మంగళవారం ప్రారంభించిన కొత్త వర్క్ బండిల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వర్క్ పర్మిట్‌లు మరియు రెసిడెన్సీ వీసాలను పొందేందుకు అవసరమైన అన్ని పత్రాలను పూర్తి చేయడానికి ప్రాసెసింగ్ సమయం దాదాపు ఒక నెల నుండి ఐదు రోజులకు తగ్గింది. ఇంటిగ్రేటెడ్ విధానంలో అవసరమైన పత్రాలు 16 నుండి ఐదుకు తగ్గుతాయని, సేవా కేంద్రాలకు వెళ్లే సంఖ్యను ఏడు నుండి రెండుకి మాత్రమే తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. వర్క్ బండిల్ ప్రభుత్వ సంస్థల కోసం అన్ని విధానాలను యూనిఫైడ్ చేస్తుందని మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) వెల్లడించింది. ఇతర ఎమిరేట్స్‌లో అమలు చేయడానికి ముందు ఇది మొదట దుబాయ్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష