'అభినేత్రి' చిత్రం టీజర్‌ విడుదల

- June 03, 2016 , by Maagulf
'అభినేత్రి' చిత్రం టీజర్‌ విడుదల

తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్‌ కీలక పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న 'అభినేత్రి' చిత్రం టీజర్‌ విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌, ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్‌, 'సోగ్గాడే చిన్నినాయనా' దర్శకుడు కల్యాణ్‌కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ... దర్శకుడు విజయ్‌కు ఓపిక చాలా ఎక్కువ అన్నారు. ఈ చిత్రం కథ కొంచమే తనకు తెలుసని, మొత్తం కథ తమన్నాకు తెలుసని పేర్కొన్నారు. తమన్నా మంచి నటి అని అభినందించారు. ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు.
ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com