ఉత్తమ హోమ్ ఫుడ్ మరియు మహిళా ఉపాధి సంస్థగా షీరో సంస్థకి అవార్డు
- March 09, 2024
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలలో రెండు వేలకు పైబడి మహిళలకు తమకు తెలిసిన వంట నైపుణ్యంతో ఇంటినుండి స్థిరమైన ఆదాయాన్ని పొందేలా మహిళలకు చేయూత నిస్తూ మరో పక్క రుచికరమైన , సుచికరమైన, ఆరోగ్యకరమైన ఇంటి భోజనాన్ని అందిస్తూ ప్రజా శ్రేయస్సుకు కృషి చేస్తున్న షీరో హోమ్ ఫుడ్ కి ఉత్తమహోమ్ ఫుడ్ మరియు మహిళా ఉపాధి సంస్థగా గుర్తిస్తూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలివేట్స్ ఎలైట్ ఫౌండేషన్ వారు అవార్డు ని అందజేశారు. ఎలేవేట్స్ ఎలైట్ సంస్థ వ్యవస్థాపకులు రవి కిషోర్, జాతీయ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబెర్ సిద్దవతం ప్రసన్న లక్ష్మి , మిసెస్ ఇండియా 2022 షెర్రీ చేతుల మీదుగా షీరో హోమ్ ఫుడ్ మహిళా సాధికారికతా సంస్థ తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్ విజయ్ వర్మ పాకలపాటి అందుకున్నారు.విజయ్ వర్మ మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపకులు తిలగరసు, జయశ్రీలు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన షీరో ఉచిత శిక్షణ, సాంకేతిక మద్దతు, ప్రచార తోడ్పాటుతో ఈ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా ఇప్పటివరకు 2 వేల మహిళలకు ఉపాధి ఇచ్చామని ఈ స్టార్ట్ అప్ ద్వారా ఒక మిలియన్ మహిళలకు ఉపాధి ఇవ్వడమే సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మాస్టర్ ఫ్రాంచైజ్ ఓనర్ గా వ్యవహరిస్తున్న సువర్ణా దేవి ఈ అవార్డు దక్కడం తమ మీద మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష