యూఏఈలో వరదలు.. రంగంలోకి రెస్క్యూ బృందాలు
- March 10, 2024
యూఏఈ: వారాంతంలో యూఏఈని భారీ వర్షాలు ప్రభావితం చేస్తున్నాయి. గత రాత్రి దేశంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షాలు కురిసాయి. మరోవైపు వర్షాల మప్పు కొనసాగుతుందని, అందరూ ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ఈవెంట్‌లను రద్దు చేశారు. పార్కులను మూసివేశారు. ఇదిలా ఉండగా NCM దేశవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా మెడికల్ ఫిట్‌నెస్ సెంటర్‌లను మూసివేస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ ప్రకటించింది. దుబాయ్‌లోని గ్రీన్ కమ్యూనిటీ మోటార్ సిటీలోని నివాసితులు తమ పరిస్థితిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ ప్రాంతంలో ఇంకా వరద తగ్గలేదని, నీటిని పంప్ చేయాల్సిన ట్యాంకర్లు ఇంకా రాలేదని ఆయా పోస్టుల్లో వెల్లడించారు. అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించడానికి వివిధ సంస్థల నుండి మొత్తం 2,300 మంది సిబ్బందిని దుబాయ్ అధికారులు మోహరించారు. 250 ట్యాంకర్లు, 300 రెయిన్‌వాటర్ పంపులు, 180కి పైగా అత్యవసర వాహనాలు, ఫీల్డ్ సర్వే వాహనాలు, యంత్రాలు ఇతర భారీ పరికరాలతో సహా 700 యూనిట్లకు పైగా పరికరాలను బృందాలకు సహాయంగా ఉండనున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష