టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

- March 11, 2024 , by Maagulf
టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

తిరుమల: టీటీడీ ఆలయాల అభివృద్ధి పనుల కోసం శ్రీవాణి ట్రస్టు నిధులు వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

టీటీడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

  • స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి ఆమోదం
  • టీటీడీ కళాశాలలో హాస్టల్ గదులు కొరత లేకుండా నిర్మించాలని నిర్ణయం
  • తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో 10 లిఫ్టుల ఏర్పాటుకు 1.88 కోట్లు కేటాయింపు
  • టీటీడీ డేటా సెంటర్ల నిర్వహణకు 12 కోట్లు కేటాయింపు
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com