నకిలీ పాస్‌పోర్టుల స్కాం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం..
- March 11, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ పాస్‌పోర్టు స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్‌లు సృష్టించిన కేసులో దర్యాప్తును సీఐడీ ముమ్మరం చేసింది. తాజాగా నకిలీ పాస్ట్‌పోర్ట్ జారీ కేసుకు సంబంధించి మరో నలుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఇప్పటికే 18 మందిని సీఐడీ అరెస్ట్ చేయగా.. తాజా అరెస్టులతో మొత్తం 22 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటివరకూ హైదరాబాద్‌కు చెందిన ఏజెంట్ కల్యాణ్‌తో పాటు మొత్తం ముగ్గురు ఏఎస్ఐలను సీఐడీ అదుపులోకి తీసుకుంది.
అరెస్ట్ అయినవారిలో మారేడ్ పల్లి ట్రాఫిక్ ఏఎస్సై తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ పీఎస్ ఏఎస్సై నజీర్ బాషా, షీటీమ్స్ ఏఎస్సై వెంకటేశ్వర్లు ఉన్నారు. 125 మంది శ్రీలంక రిప్యూజీలకు సంబంధించిన పాస్‌పోర్టులను నకిలీ పత్రాలతో జారీ చేసినట్టు సీఐడీ దర్యాప్తులో గుర్తించింది. నకిలీ పాస్‌పోర్టు, వీసాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ శాఖలకు సీఐడీ అధికారులు వివరాలను పంపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష