ఇస్మార్ట్ బ్యూటీ పరిస్థితి అలా అయిపోయిందే పాపం.!
- March 12, 2024
‘అదుగో’ అంటూ తొలి సినిమాపై సైన్ చేసింది. కానీ, ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాతో కుర్రకారు హృదయాల్ని దోచేసింది. ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో జూనియర్ ఇలియానా బిరుదును సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.
కానీ ఆ సక్సెస్ ఆమెకు ఎంతో కాలం నిలవలేదు. ఇంతకీ ఎవరి గురించి చెప్పుకుంటున్నామో గుర్తించారు కదా..! అదేనండీ నభా నటేష్. ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ డూపర్ హిట్ కొట్టి.. ఆ తర్వాత ‘అల్లుడు అదుర్స్’ తదితర సినిమాల్లో నటించింది. అలాగే మాస్ రాజాతోనూ స్ర్కీన్ షేర్ చేసుకుంది.
కానీ, కెరీర్‌లో ముందుకు సాగలేకపోయింది. మొన్నా మధ్య ఓ యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలలు కంప్లీట్ బెడ్ రెస్ట్‌లోకి వెళ్లిపోయిన నభా నటేష్ మళ్లీ వస్తోంది.
అయితే, ఈ సారి కమెడియన్ ప్రియదర్శికి జోడీగా నటించాల్సి వచ్చింది నభా నటేష్‌కి. ప్రియదర్శి హీరోగా రూపొందుతోన్న ఓ కామెడీ ఎంటర్ టైనర్‌లో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. చూడాలి మరి, ఈ సినిమాతోనైనా నభా నటేష్ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో.!
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







